Share News

బోటు ఆచూకీ దొరికే వరకు సెర్చ్ ఆపరేషన్ ఆపేది లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Aug 21 , 2026 | 02:08 PM

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలిసే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.

బోటు ఆచూకీ దొరికే వరకు సెర్చ్ ఆపరేషన్ ఆపేది లేదు: మంత్రి అచ్చెన్నాయుడు
Kinjarapu Atchannaidu

స్పోర్ట్స్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'ముత్యాలమ్మ' (IND-AP-E8-MO-135) బోటులో ఆగస్టు 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఒడిశాలోని పారాదీప్ తీరం వద్ద ఒక పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.


సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం నిరంతరం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ గాలింపు చర్యల కోసం ఏకంగా 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, ఒక ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


గల్లంతైన బోటు వివరాలను మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్, బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ అధికారులకు కూడా పంపించామని.. సరిహద్దు తీరప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులతో ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ నెల 24 తర్వాత కొత్త అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ గాలింపు చర్యలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని మంత్రి అచ్చెన్న వెల్లడించారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారి రక్షణకు అన్ని విధాలుగా కట్టుబడి ఉందని మంత్రి భరోసా కల్పించారు.


ఇవి కూడా చదవండి...

అన్నవరం బస్టాండ్‌‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు..

అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు

Updated Date - Aug 21 , 2026 | 02:38 PM