తెలంగాణను హెచ్ఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: దామోదర రాజనర్సింహ
ABN , Publish Date - Aug 11 , 2026 | 04:29 PM
హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు రేపు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్, ఆగస్టు 11: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు రేపు(బుధవారం) భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. హెచ్ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ నియంత్రణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు చెప్పారు. ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగనుందని మంత్రి తెలిపారు. సుమారు 1500 మంది ర్యాలీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
హెచ్ఐవీ బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి తెలిపారు. హెచ్ఐవీ ఇతరులకు, ముఖ్యంగా పుట్టబోయే శిశువులకు సంక్రమించకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ నిర్మూలన ప్రచారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘బి పాజిటివ్ టు స్టాప్ హెచ్ఐవీ పాజిటివ్’ నినాదంతో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణను హెచ్ఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాగా.. రేపు ఈ ర్యాలీని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్.. జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాలేజీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ర్యాలీలో పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి...
పేద పిల్లల కలలకు చిరునామాగా.. యంగ్ ఇండియా స్కూల్స్: సీఎం రేవంత్ రెడ్డి
పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలి... ప్రధానికి వీహెచ్ లేఖ
Read Latest Telangana News And Telugu News