టీజీ ఈసీఈటీ- 2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ABN , Publish Date - May 29 , 2026 | 05:39 PM
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి 'TG ECET 2026' ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది.
హైదరాబాద్, మే 29: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 'TG ECET 2026' ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. 2026 మే 15న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు, విద్యార్థుల మార్కుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
డిప్లొమా(పాలిటెక్నిక్), బీఎస్సీ(మ్యాథమెటిక్స్) పూర్తిచేసిన విద్యార్థులకు నేరుగా బీటెక్, బీఫార్మసీ కోర్సుల ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ పరీక్షను ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల విడుదల నేపథ్యంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థుల్లో సందడి నెలకొంది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను, ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ecet.tgche.ac.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి స్క్రీన్‌పై ఫైనల్ ర్యాంక్‌ను చూసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే కేటగిరీల వారీగా కౌన్సెలింగ్ తేదీలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించనుంది. అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే వరకు విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను, హాల్ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించి అప్‌డేట్ల కోసం విద్యార్థులు నిరంతరం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాల్సిందిగా కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాధారణ పీఏ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి..? : పట్టాభి
ఆర్ఎమ్‌యూకి రైళ్ల తయారీ బాధ్యత.. ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు..