Share News

విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ABN , Publish Date - May 29 , 2026 | 04:21 PM

మహనీయుల విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు.

విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, మే 29: మహనీయుల విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు ఎదురవుతున్న ఇబ్బందులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. విగ్రహాల ఏర్పాటులో అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నియమాలకు విరుద్ధమైన స్థలాలపై ముందుగానే నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.


చివరి నిమిషంలో అభ్యంతరాలు చెప్పొద్దని అధికారులకు మంత్రి సూచించారు. దళిత సంఘాల నాయకులపై అనవసరంగా కేసులు పెట్టొద్దని తెలిపారు. అలాగే ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సి ఉందని పేర్కొన్నారు. అంబేడ్కర్, ఫులే, జగ్జీవన్ రామ్ ఆశయాలే ప్రభుత్వానికి మార్గదర్శకమని చెప్పారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అభివర్ణించారు. విగ్రహాలు సామాజిక చైతన్యానికి ప్రతీకలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సమస్యల పరిష్కారంపైనే ప్రధాన దృష్టి పెట్టాల్సి ఉందని ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాధారణ పీఏ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి..? : పట్టాభి

ఆర్ఎమ్‌యూకి రైళ్ల తయారీ బాధ్యత.. ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 29 , 2026 | 04:48 PM