జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. మహిళా కార్మికుల అరెస్ట్
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:16 PM
ఇంటింటి నుంచి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వచ్ఛ ఆటో కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: నగరంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వచ్ఛ ఆటో కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకు నిరసనగా శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం ముట్టడి కోసం వారంతా తరలి వచ్చి.. ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు ఆటో కార్మికులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వచ్ఛ ఆటో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీశ్ రావు బంధువు భూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ బృందం
వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ
For More TG News And Telugu News