తెలంగాణ మహిళా కమిషన్‌కు జాతీయస్థాయి ప్రశంసలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:33 AM
మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయా కె. రహాత్కర్ అభినందించారు.
న్యూఢిల్లీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయా కె. రహాత్కర్ అభినందించారు. ఆమెను న్యూఢిల్లీలోని కార్యాలయంలో సోమవారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషన్ నిర్వహిస్తున్న విచారణలు, బాధిత మహిళలకు సత్వర న్యాయం, ఆర్థిక స్వావలంబన, చట్టాలపై అవగాహన, గ్రామీణ మహిళల అభ్యున్నతి, సైబర్ నేరాల నివారణపై చేపట్టిన కార్యాచరణను వివరించే సమగ్ర నివేదికల ప్రత్యేక పుస్తకం ‘టీ-వైఫ్’ (తెలంగాణ - ఉమెన్ ఇనిషియేటివ్స్ ఫర్ ఫ్యూచర్ ఎంపవర్‌మెంట్ విత్ ఈక్విటీ)ని అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News