Share News

చలి.. చలి.. చలి!

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:15 AM

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ఈ సీజన్‌లోనే తొలిసారిగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి సింగిల్‌ డిజిట్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చలి.. చలి.. చలి!
Telangana Cold Wave

  • రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న చలి తీవ్రత

  • ఈ సీజన్‌లో తొలిసారిగా సింగిల్‌ డిజిట్‌కి పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

  • జహీరాబాద్‌ జిల్లా సత్వార్‌లో 9.6.. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 9.7 డిగ్రీల నమోదు

  • 20-27 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు

హైదరాబాద్‌, కోహీర్‌, కామారెడ్డి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ఈ సీజన్‌లోనే తొలిసారిగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి సింగిల్‌ డిజిట్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జహీరాబాద్‌ జిల్లా సత్వార్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 9.6, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 10.5, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 10.7, వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌లో 11, రాజధాని ప్రాంతంలోని పఠాన్‌చెరులో 12.2, బీహెచ్‌ఈఎల్‌లో 12.5, అమీన్‌పూర్‌లో 13, గచ్చిబౌలిలో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు, చలి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


కాగా, ఈ నెల 20-27 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 20-23 తేదీల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే 24-27 తేదీల్లో నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, యాదాద్రి, హైదరాబాద్‌ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 05:15 AM