Share News

బీఆర్ఎస్ హయాంలో నీటి వాటాల్లో తెలంగాణకు నష్టం: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:55 PM

తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీ పడబోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో నీటి వాటాల్లో తెలంగాణకు నష్టం: మంత్రి శ్రీధర్ బాబు
TG Minister D. Sridhar Babu

హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీ పడబోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. బుధవారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరవుతామని తెలిపారు. నీటీ వాటాపై బలంగా కొట్లాడుతామని పేర్కొన్నారు. అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మండిపడ్డారు.


కేసీఆర్ ఫాం హౌస్‌లో పండిన వరికి వచ్చిన ధర ఎంతో చెప్పాలంటూ కేటీఆర్‌ను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తాము కోటిన్నర రూపాయిలకు ఇచ్చిన భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 90 లక్షలకే ఇచ్చిందని గుర్తు చేశారు. నిబంధనల మేరకే భూ కేటాయింపులు జరిగాయని ఆయన వివరించారు. 5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు ఇచ్చామని చెప్పారు. కేటీఆర్ చెబుతున్న రూ. 200 కోట్లు ఎక్కడివో చెప్పాలని నిలదీశారు.


హిల్ట్ పాలసీ వల్ల హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలను భయపెట్టడం కేటీఆర్‌కు మంచిది కాదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం సరైనది కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడికి హితవు పలికారు. తమపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపవద్దని ఆయనకు సూచించారు. బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేద పేర్కొన్నారు. అందుకే ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

వికారాబాద్‌ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

For More TG News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 01:47 PM