అన్ని జిల్లా కేంద్రాల్లో హమాలీ కార్యాలయాలు
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:23 AM
రాష్ట్రంలోని హమాలీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక మంత్రి గడ్డం వివేక్ తెలిపారు.
వారి పిల్లలకు నైపుణ్య శిక్షణ.. కొలువుల కల్పన
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్
పెద్దపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హమాలీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ (టీహెచ్‌డబ్ల్యూయూ) దశాబ్ది ఆవిర్భావ వేడుక ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో హమాలీల కోసం కార్యాలయాలు నిర్మిస్తామని, వారి పిల్లలకు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్రంలోని ఐటీఐల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టి నైపుణ్య శిక్షణ అందిస్తామని, అర్హతల ఆధారంగా హమాలీల పిల్లలు జర్మనీలో ఏడాదికి రూ.25 లక్షల వేతనం లభించే కొలువులు పొందేలా కృషి చేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం, నీటి లభ్యత, విద్యుత్ వినియోగంపై సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, వీటిని సమష్టిగా అధిగమించాలని మంత్రి పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్‌ఎస్ కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ విజయరమణారావు, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
65 కాలేజీల్లో నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు!
జనసేనతో పొత్తు వద్దే వద్దు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News