Share News

7,500 కోట్ల అప్పు తీసుకోనున్న తెలంగాణ

ABN , Publish Date - Sep 13 , 2026 | 07:41 AM

రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కోట్ల అప్పు తీసుకోనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 16న నిర్వహించే ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించనుంది.

7,500 కోట్ల అప్పు తీసుకోనున్న తెలంగాణ
Telangana Government

  • 16న ఈ-వేలం ద్వారా తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కోట్ల అప్పు తీసుకోనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 16న నిర్వహించే ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించనుంది. 7.53 శాతం వార్షిక వడ్డీ, 13ఏళ్ల కాల పరిమితితో రూ.1,500 కోట్లు., 7.64 శాతం వార్షిక వడ్డీ, 18 ఏళ్ల కాల పరిమితితో రూ.2000 కోట్లు., 7.65 శాతం వార్షిక వడ్డీ, 23 ఏళ్ల కాల పరిమితితో రూ.2000 కోట్లు., 7.65 శాతం వార్షిక వడ్డీ, 29 ఏళ్ల కాల పరిమితితో రూ.2000 కోట్ల చొప్పున మొత్తం రూ.7,500 కోట్ల రుణాన్ని తీసుకోనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టత ఇవ్వాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 07:42 AM