Share News

ధాన్యం రవాణా వాహనాల జీపీఎస్‌కు.. వీఎల్‌టీఎస్‌, ఓపీఎమ్మెస్‌తో అనుసంధానం

ABN , Publish Date - Sep 26 , 2026 | 07:11 AM

రాష్ట్రంలో ధాన్యం రవాణా వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ధాన్యం రవాణా వాహనాలకు ఇప్పటికే అమర్చిన జీపీఎస్‌ పరికరాలను ..

ధాన్యం రవాణా వాహనాల జీపీఎస్‌కు.. వీఎల్‌టీఎస్‌, ఓపీఎమ్మెస్‌తో అనుసంధానం
GPS Tracking

  • డేళ్ల ఒప్పందానికి టెండరు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం రవాణా వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ధాన్యం రవాణా వాహనాలకు ఇప్పటికే అమర్చిన జీపీఎస్‌ పరికరాలను ‘వెహికిల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌’(వీఎల్‌టీఎస్)తో అనుసంధానం చేయటానికి ఏజెన్సీని ఎంపిక చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈక్రమంలోనే అర్హత, అనుభవం కలిగిన సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి ఆన్‌లైన్‌ బిడ్లను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్‌ కూడా జారీచేసింది.


జీపీఎస్‌ పరికరాలను వీఎల్‌టీఎస్‌తో అనుసంధానం చేయటం ద్వారా ధాన్యాన్ని రవాణా చేసే వాహనాలు ఎప్పుడు? ఎక్కడ? ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ధాన్యం సేకరణలో వినియోగిస్తున్న ‘ఓపీఎంఎస్‌’ స్టేట్‌ ప్రొక్యూర్మెంట్‌ పోర్టల్‌తోనూ అనుసంధానం చేయనున్నారు. దీంతో ధాన్యం రవాణా ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించేందుకు వీలవుతుంది. ఎంపికైన సర్వీస్‌ ప్రొవైడర్‌.. 2026 అక్టోబరు 1వ తేదీ నుంచి 2029 సెప్టెంబరు 30 వరకు సేవలు అందించాల్సి ఉంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. సాంకేతికంగా అర్హత సాధించిన బిడ్డర్లలో అత్యల్ప ఎల్‌-1 బేస్‌ ఫర్‌ ట్రిప్‌ రేటు కోట్‌ చేసిన సంస్థను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పోర్టల్‌లో ‘ఆర్‌ఎఫ్‌పీ’ను తెలంగాణ రాష్ట్ర ఈ-ప్రొక్యూర్మెంట్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2వ తరగతిలోనే...చదవాలి, రాయాలి

డిగ్రీకి క్లోజింగ్‌ బెల్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 07:29 AM