తెలంగాణలో పర్యటించిన ఎన్డీసీ బృందం
ABN , Publish Date - Mar 17 , 2026 | 08:26 PM
నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అధికారుల బృందం తెలంగాణ పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, విద్యా రంగాల పురోగతిపై విపులంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు.
హైదరాబాద్, మార్చి 17: నేషనల్ డిఫెన్స్ కాలేజ్(ఎన్డీసీ) అధికారుల బృందం తెలంగాణ పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, విద్యా రంగాల పురోగతిపై విపులంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రం తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, పునరుత్పాదక శక్తి ఉత్పత్తికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
అలానే విద్యారంగంలో 105 నియోజకవర్గాల్లో ఆధునిక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఐటీఐల్లో టాటా టెక్నాలజీస్ సహకారంతో ఆధునిక ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, టీ-హబ్, వీ-హబ్‌ల ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తున్నామని సీఎస్ తెలిపారు. అలాగే 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర పాలన, అభివృద్ధి ప్రణాళికలపై ఎన్డీసీ అధికారులు ప్రశంసలు కురిపించారు. తెలంగాణ పురోగతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే
తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం