Share News

హైదరాబాద్: కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. నిందితుల అరెస్ట్

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:27 PM

హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి రూ.77 లక్షల నగదు రికవరీ చేశారు.

హైదరాబాద్: కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. నిందితుల అరెస్ట్
Kukatpally Robbery News

హైదరాబాద్‌: కూకట్‌పల్లి ప్రాంతంలో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.77 లక్షల రికవరీ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కూకట్​పల్లిలో ఖుస్రు, అజిముద్దీన్ అనే వ్యక్తులు కోటి రూపాయల నగదును తీసుకుని వెళ్తుండగా వారిపై గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడి చేశారు. కళ్లలో కారం చల్లి, వారి వద్ద ఉన్న కోటి రూపాయల నగదును తీసుకుని పరారయ్యారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా రూ.1 కోటితో పరారైన నలుగురు దుండగుల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే

తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం

Read Latest Telangana News

Updated Date - Mar 17 , 2026 | 08:08 PM