Share News

ఖరీఫ్‌ ధాన్యం సేకరణ లక్ష్యం 65 లక్షల మెట్రిక్‌ టన్నులు

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:27 AM

ప్రస్తుత (2026- 27) వానాకాలం సీజన్‌లో 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

ఖరీఫ్‌ ధాన్యం సేకరణ లక్ష్యం 65 లక్షల మెట్రిక్‌ టన్నులు
Telangana Kharif Paddy

  • వచ్చే నెల మొదటి వారం నుంచే కొనుగోళ్లు

  • రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

  • బోనస్‌ పొందాలంటే అగ్రిస్టాక్‌ ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి

  • రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత (2026- 27) వానాకాలం సీజన్‌లో 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో 8,283 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్టోబరు మొద టి వారం నుంచే ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింద ని మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో స్టీఫెన్‌ రవీంద్ర చెప్పారు. వివిధ జిల్లాల పౌర సరఫరాలశాఖ అధికారులు, మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ధాన్యం సేకరణకు ఇబ్బందులు లేకుం డా.. ఎస్‌హెచ్‌టీ(స్టోరేజీ, హమాలీ, ట్రాన్స్‌పోర్టు) వ్యూహాన్ని పక్కా గా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.


రైతులు బోనస్‌ పొందాలంటే కచ్చితంగా ‘అగ్రిస్టాక్‌ ఫార్మర్‌ ఐడీ’ ఉండాల్సిందేనని కమిషనర్‌ స్పష్టంచేశారు. బీపీటీ- 5204, ఆర్‌ఎన్‌ఆర్‌- 15048, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్‌, కేఎన్‌ఎం- 1638, వరంగల్‌-44, కేఎన్‌ఎం-7715 రకాలను పండించిన రైతులకే బోనస్‌ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రం లో తేమను కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ధాన్యం ఆరబెట్టే యంత్రాలు ముందస్తుగా అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది హమాలీలు ఉండేలా ఆధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధాన్యం నిల్వకు వాడకంలో లేని రైస్‌మిల్లులు, ఫంక్షన్‌ హాళ్లు, ఇతర ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి సిద్ధంగా ఉంచాలని సూచించారు. మిల్లింగ్‌ దశలో అవకతవకల నిరోధానికి ‘ఫిజికల్‌ వెరిఫికేషన్‌’ మొబైల్‌ యాప్‌ను ఉపయోగిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎర్రవల్లిలో కొనసాగిన సర్వే
చిన్నారుల అక్రమ రవాణా, దత్తతలపై హైకోర్టు ఫైర్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 07:34 AM