కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:02 PM
జూన్ 30వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది.
హైదరాబాదా జూన్18: జూన్ 30వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరుసగా తొమ్మిది రోజుల పాటు రైతుల ఖాతాల్లో ఈ భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. జూన్ 30వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిరలో నిర్వహించే సభలో ఈ రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పెట్టుబడి సాయాన్ని రెండు పంటల కాలాలకు (ఖరీఫ్, రబీ) విడగొట్టి, ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ. 6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
మరో వైపు 23వ ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద నిధులను కేంద్రం జూన్ 20వ తేదీన విడుదల చేయనుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దాంతో ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున నగదు జమ కానుంది. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 రోజుల తేడాతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నాయి.
ఇవి కూడా చదవండి..
వైసీపీకి ఒక్క ఓటు వేసిన పాపానికి ఐదేళ్లు రాష్ట్రం నాశనమైంది: మంత్రి గొట్టిపాటి
అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న కృష్ణా జిల్లా: మంత్రి వాసంశెట్టి సుభాశ్
Read Latest TG News And Telugu News