Share News

అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న కృష్ణా జిల్లా: మంత్రి వాసంశెట్టి సుభాష్

ABN , Publish Date - Jun 18 , 2026 | 02:41 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహకారంతో సంక్షేమం - అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న కృష్ణా జిల్లా: మంత్రి వాసంశెట్టి సుభాష్
Minister Vasamsetti Subhash

అమరావతి, జూన్ 18: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహకారంతో సంక్షేమం - అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కింద 1.33 లక్షల రైతు కుటుంబాలకు రూ.252.94 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు 29 కిసాన్ డ్రోన్లను సబ్సిడీపై అందించామన్నారు.


ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. పశుసంవర్ధక రంగంలో ఇంటి వద్దకే పశువైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పరిశ్రమల రంగంలో కృష్ణా జిల్లా విశేష పురోగతి సాధించిందని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. విద్యారంగంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, మెగా డీఎస్సీ ద్వారా 1,203 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 1.98 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించామని అన్నారు. ఆరోగ్య రంగంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రతి నెల 2.30 లక్షల మందికి ప్రయోజనం అందుతోందని వెల్లడించారు.


మహిళా సాధికారత కోసం డ్వాక్రా, స్త్రీనిధి ద్వారా వేల కోట్ల రుణాలు అందించామని మంత్రి తెలిపారు. రెవెన్యూ శాఖ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. 1.27 లక్షలకుపైగా భూ హక్కు పత్రాలను పంపిణీ చేశామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పేదలకు గృహ వసతి కల్పించడంలో ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందన్నారు. మచిలీపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనుందని తెలిపారు. పోర్టు, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కృష్ణా జిల్లాను పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో కృష్ణా జిల్లా అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 03:06 PM