సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:32 PM
విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది.
విశాఖపట్నం, జూన్ 18: విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది. గాయత్రి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లి సత్యవతి.. దీనిపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు అల్లుడు శ్రీచరణ్‌పైనే అనుమానం ఉందన్నారు. ఈ కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తే అనేక విషయాలు బయటపడతాయని తల్లి సత్యవతి చెప్పారు.
న్యాయం చేయండి: తల్లి సత్యవతి
‘నా కూతురి మృతి విషయంలో అల్లుడుపైనే అనుమానం. నా కూతురికి మద్యం సేవించే అలవాటు లేదు. గాయత్రిపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు. రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నామని చివరిసారిగా నాకు చెప్పింది. విహారయాత్ర ముగించుకొని విశాఖకు వస్తానని చెప్పింది. విశాఖకు రాకుండానే నా కూతుర్ని హతమార్చారు. విశాఖకు వచ్చిన తర్వాత రెండు నెలలు వర్క్ ఫ్రం హోం పెట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పింది. నా కూతురి విషయంలో మీడియా నాకు న్యాయం చేయాలి. మాది సాంప్రదాయమైన కుటుంబం’ అని తల్లి సత్యవతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి...
కోస్తాతీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు
Read Latest AP News And Telugu News