ఉపాధి ఎఫ్‌టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:54 AM
ఉపాధి హామీ(వీబీజీరామ్‌జీ) పథకం కింద గ్రామీణాభివృద్ధి విభాగంలో పనిచేస్తున్న ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులకు(ఎ్ఫటీఈ) రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించింది.
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ(వీబీజీరామ్‌జీ) పథకం కింద గ్రామీణాభివృద్ధి విభాగంలో పనిచేస్తున్న ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులకు(ఎఫ్‌టీఈ) రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ సమస్యకు పరిష్కారం చూపుతూ అర్హులైన ఎఫ్‌టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీతో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగ ళవారం జీవో నంబర్ 548ను జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు 3,800 మంది ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో ఆర్థిక భరోసా లభించనుంది. గ్రాట్యుటీ ప్రయోజనాలను కల్పించాలన్న ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవీఎస్ రాజు కన్నుమూత
రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే కుట్ర: హరీశ్
రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారింది
Read Latest AP News And Telangana News And International