Share News

ఆర్టీసీ ఎన్నికల్లో ‘ఎంప్లాయీ‌స్’దే విజయం

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:52 AM

ఎవరెన్ని అనైతిక ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆర్టీసీ యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో.. కార్మిక వర్గం సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏఐటీయూసీ గెలవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

ఆర్టీసీ ఎన్నికల్లో ‘ఎంప్లాయీ‌స్’దే విజయం
Kunamneni Sambasiva Rao

  • సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ధీమా

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎవరెన్ని అనైతిక ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆర్టీసీ యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో.. కార్మిక వర్గం సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏఐటీయూసీ గెలవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.బాబు, ఈదురు వెంకన్నలతో కలిసి ఆదివారం సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ తన అనుబంధ ఐఎన్‌టీయూసీని పక్కనబెట్టి.. ఇప్పటికిప్పుడు ‘టీడబ్ల్యూయూ’ను తన అధికార సంఘంగా పేరు పెట్టి.. ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ను ఓడించేందుకు ప్రయత్నించడం అధర్మమన్నారు.


సీపీఐ మద్దతున్న ఎంప్లాయీస్‌ యూనియన్‌ను ఓడించడానికి అధికార కాంగ్రెస్‌ పార్టీ తనది కానీ యూనియన్‌కు మద్దతునిస్తోందని చెప్పారు. ఎన్నికల్లో ఏ యూనియన్‌ అయినా పోటీ చేయొచ్చునని.. కానీ సొంత సంఘాన్ని పక్కన బెట్టి.. సంస్థ పరిరక్షణకు పాటుపడిన ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్‌ యూనియన్‌ను ఓడించాలనకోవడం ఆత్మహత్యా సాదృశ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ఇటు బీఆర్‌ఎస్‌.. అటు బీజేపీతో ఉన్న టీడబ్ల్యూయూ నాయకులను అక్కున చేర్చుకోవడం వారిష్టమైనా.. దాని వెనుక రాజకీయ కుట్ర ఉండకూడదని పేర్కొన్నారు. ఆర్టీసీ పుట్టుక నుంచి కార్మికోద్యమంతో ఏఐటీయూసీకి పేగుబంధం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌కే ఆర్టీసీ కార్మికులు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చేతులెత్తేసిన కొత్త కాంట్రాక్టర్‌?!

కేటీఆర్‌కు వణుకు మొదలైంది

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 06:52 AM