ఆర్టీసీని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం: మంత్రి పొన్నం
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:38 PM
ఆర్టీసీ పేద ప్రజలకు లైఫ్ లైన్ లాంటిదని తెలంగాణ రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకార్ అభివర్ణించారు. గురువారం అసెంబ్లీలో ఆర్టీసీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఆర్టీసీ పేద ప్రజలకు లైఫ్ లైన్ లాంటిదని తెలంగాణ రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకార్ అభివర్ణించారు. గురువారం అసెంబ్లీలో ఆర్టీసీపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో మినీ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని చూస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 540 ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయని వివరించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన రోజే అసెంబ్లీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఆర్టీసీ డిపోలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యాదాద్రి జిల్లాలోని వంగపల్లి మండలంలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఆసిఫాబాద్, కాగజ్ నగర్‌లో ఆర్టీసీ డిపోల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మిర్యాలగూడలో నూతన డిపో ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్
For More TG News And Telugu News