4, 5 తేదీల్లో తేలికపాటి వర్షాలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:40 AM
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఒకవైపు ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండగా, మరోవైపు అక్టోబరు మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఒకవైపు ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండగా, మరోవైపు అక్టోబరు మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుందని, అక్టోబరు 4, 5 తేదీల్లో మాత్రం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34-37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. బుధవారం ఖమ్మంలో అత్యధికంగా 37.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 29 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!
Read Latest AP News And Telangana News And International News And Telugu News