బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:48 PM
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రైల్వే ప్రాజెక్టులతోపాటు నిధుల కేటాయింపులను రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. సోమవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాలను తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 02: కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌కు సమర్పించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రైల్వే ప్రాజెక్టులతోపాటు నిధుల కేటాయింపులను రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. సోమవారం న్యూఢిల్లీలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.5,454 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు.
అలాగే మూడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు ఇచ్చామని చెప్పారు. అవి.. హైదరాబాద్ - బెంగళూరు (రెండున్నర గంటల ప్రయాణం..) , హైదరాబాద్ - చెన్నై (2:55 గంటల ప్రయాణం..), హైదరాబాద్ - పుణె (1:45 గంటల ప్రయాణం..) అంటూ సోదాహరణగా వివరించారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లు అన్నీ ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మిస్తామన్నారు. అందుకు సంబంధించిన పనులను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
బుల్లెట్ ట్రైన్‌కు హైదరాబాద్ మహా నగరం హబ్‌గా మారుతుందని స్పష్టం చేశారు. ఇది సౌత్ ఇండియా డైమండ్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కంటే అధికంగా తెలంగాణ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించామని ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
అయినా 2026-27 బడ్జెట్‌లో కేంద్రం మొండి చేయి చూపిందంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని పలువురు అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. అలాంటి వేళ రైల్వే శాఖ ద్వారా తెలంగాణకు జరిగిన బడ్జెట్ కేటాయింపులను ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోదాహరణగా వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్
జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల
For More TG News And Telugu News