ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:17 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్ ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని స్పష్టం చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 02: నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై దాడి.. కెమెరా ధ్వంసం ఘటనను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఖండించింది. ఈ దాడి ఘటనపై హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సోమవారం స్పందించింది. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని స్పష్టం చేసింది. తమ అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరించే జర్నలిస్టులపై హింస, దౌర్జన్యం తగదని అభిప్రాయపడింది. ఈ దాడుల ద్వారా జర్నలిస్టులు, మీడియాను భయబ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెస్ క్లబ్ కమిటీ వెల్లడించింది.
ఇంతకీ ఏం జరిగింది..?
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో దాదాపు నాలుగున్నర గంటల పాటు సిట్ అధికారులు ఆదివారం విచారించిన విషయం విదితమే. బీఆర్ఎస్ భవన్ వద్ద కవరేజ్ కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్ పవన్ వెళ్లారు. ఆ సమయంలో కవరేజ్ చేస్తున్న పవన్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీతో దాడి చేసి.. కెమెరాను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యక్రమాలు కవర్ చేయవద్దంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులను బెదిరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఓట్ల కోసమే ఇందిరమ్మ ఇళ్లు: టీ బీజేపీ చీఫ్
జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల
For More TG News And Telugu News