Share News

ఆచార్య త్రివేణి కుల ధ్రువీకరణపై విచారణ జరపాలి

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:57 AM

ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సోడిమళ్ల త్రివేణి కుల ధ్రువీకరణపై విచారణ జరిపించాలని బీసీ ఉద్యమ వేదిక, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుకు ఫిర్యాదు చేశారు.

ఆచార్య త్రివేణి కుల ధ్రువీకరణపై విచారణ జరపాలి

  • సీఎస్‌కు బీసీ ఉద్యమ వేదిక, నిరుద్యోగ జేఏసీ పిర్యాదు

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సోడిమళ్ల త్రివేణి కుల ధ్రువీకరణపై విచారణ జరిపించాలని బీసీ ఉద్యమ వేదిక, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుకు ఫిర్యాదు చేశారు. బుధవారం సచివాలయంలో సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. త్రివేణి కుటుంబం క్రైస్తవ మతం స్వీకరించినట్లు, ఆమె కుమారుడు క్రిస్టియన్‌ మైనారిటీ కోటాలో ఎంబీబీఎస్‌ చదువుతున్నట్లు తమకు సమాచారం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఎస్సీ రిజర్వేషన్‌ ద్వారా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులైన ఆమె ప్రస్తుతం అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్‌ వర్తించదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆమె కుల ధ్రువీకరణను పరిశీలించాలని కోరారు. విచారణలో త్రివేణి ఎస్సీ కాదని తేలితే.. ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆమె కుమారుడు పొందిన ఎంబీబీఎస్‌ సీటు విషయంలోనూ విచారణ జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 04:57 AM