23న రాష్ట్రస్థాయి డాక్ అదాలత్
ABN , Publish Date - Oct 08 , 2026 | 06:12 AM
‘‘ఇండియా పోస్ట్ వినియోగదారుల సేవలకు’’ సంబంధించి ప్రజల ఫిర్యాదులు, సమస్యలను తెలుసుకునేందుకు డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇండియా పోస్ట్ వినియోగదారుల సేవలకు’’ సంబంధించి ప్రజల ఫిర్యాదులు, సమస్యలను తెలుసుకునేందుకు డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. సిబ్బంది పనితీరు, సేవలకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలకు సంబంధించిన సమస్యలు డాక్ అదాలత్‌లో స్వీకరిస్తారన్నారు. వర్చువల్ విధానంలో అక్టోబరు 23న మధ్యాహ్నం 12 గంటల వరకు వీటిని స్వీకరిస్తారని తెలంగాణ సర్కిల్ ముఖ్య తపాల జనరల్ కార్యాలయం అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇండియా పోస్ట్ కస్టమర్ సర్వీసె్‌సకు సంబంధించి ప్రజల ఫిర్యాదులు, సమస్యలను అక్టోబరు 14లోపు ఆఫ్‌లైన్ పద్ధతిలో అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. విజయ జ్యోతికి పంపవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదుతోపాటు అధికారులు తిరిగి సంప్రదించడానికి వీలుగా తమ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామాను తప్పనిసరిగా తెలియజేయాలని కోరారు. తమ సమస్యను pgco.tl@indiapost.gov.in ఈ-మెయిల్ రూపంలోనూ పంపవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి...
సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఏది నచ్చింది.. ఏది నచ్చలేదు..
చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
అక్టోబరు జీతంతోనే 2 డీఏలు
Read Latest AP News And Telugu News