అందుకే తెలంగాణ వడ్లను కేంద్రం కొనుగోలు చేయడం లేదు: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:27 PM
తెలంగాణ రాష్ట్రంలోని వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేదని పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే ఈ వడ్లను కేంద్రం కొనుగోలు చేయడానికి సుముఖంగా లేదన్నారు.
హైదరాబాద్, జూన్09: తెలంగాణ రాష్ట్రంలోని వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేదని పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే ఈ వడ్లను కేంద్రం కొనుగోలు చేయడానికి సుముఖంగా లేదన్నారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండించిన 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని మరోసారి కేంద్ర మంత్రి ప్రహ్లాడ్ జోషికి లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ప్రోక్యూర్‌మెంట్ వచ్చే అవకాశం ఉందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంకా పంట సాగవుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు చెప్పేవన్నీ ఆబద్ధాలేనని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఆన్‌లైన్‌లో రైతులు, మహిళా సంఘాల అకౌంట్‌లో నగదు వేస్తున్నామని చెప్పారు. మహిళ సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి రూ.170 కోట్లు చెల్లించామని వివరించారు.
18 లక్షల మేట్రిక్ టన్నుల మొక్క జొన్న కూడా కొనుగోలు చేశామని తెలిపారు. క్వింటాకు రూ.1000 నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత బాధ్యతగా కొనుగోలు చేయలేదని చెప్పారు. భవిషత్తులో పాడి ప్రోక్యూర్‌మెంట్‌లో ఏ విధంగా పోవాలని దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో హమాలీల సమస్య అధికంగా ఉందన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న స్టోరేజ్ సరిపోవడం లేదన్నారు. బుధవారం మేడిగడ్డలో మూడు బ్యారేజీల టెస్టింగ్ ప్రక్రియపై సమీక్ష చేస్తామని చెప్పారు. ఈ మూడు బ్యారేజిల్లో నీళ్లు నింపొద్దని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చెప్పిందని గుర్తు చేశారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే కొట్టకుపోతాయని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం చేసిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కిషన్ రెడ్డి
వైసీపీ అసత్య ప్రచారం.. వారి దిగజారుడుతనానికి నిదర్శనం: ఎంపీ కలిశెట్టి
Read Latest TG News And Telugu News