Share News

కొత్త ఆస్పత్రుల పనులు వేగవంతం చేయాలి.. నిర్మాణం పూర్తయ్యేలోపు సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 04 , 2026 | 04:42 AM

ఎల్బీనగర్‌, అల్వాల్‌, వరంగల్‌, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజును ఆదేశించారు.

కొత్త ఆస్పత్రుల పనులు వేగవంతం చేయాలి.. నిర్మాణం పూర్తయ్యేలోపు సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలి
Revanth Reddy

  • అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎల్బీనగర్‌, అల్వాల్‌, వరంగల్‌, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజును ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను మొదలు పెట్టాలని, ఆస్పత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆస్పత్రుల నిర్మాణం, పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఆస్పత్రుల్లో అవసరమైన అత్యాధునిక పరికారాలను కొనుగోలు చేసి, నిర్మాణం పూర్తయ్యే నాటికి అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించేలా చూడాలని సీఎ్‌సకు సూచించారు.


జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఆస్పత్రులను సందర్శించాల్సిందేనని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లాకు సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతీ వారం వీటిపై సమీక్ష నిర్వహించాలని, సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు. డిసెంబరులో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026 ఏర్పాట్లపైనా సమావేశంలో అధికారులతో చర్చించారు. సమ్మిట్‌ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడుల విషయంలో పకడ్బందీగా ప్రణాళికలు సిద్థం చేయాలని సీఎం సూచించారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...
వృద్ధులకూ ఉచిత బస్సు ప్రయాణం? సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రేవంత్‌ ప్రభుత్వం

అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా, నలుగురు మహిళల మృతి

పిల్లల ఆన్‌లైన్‌ భద్రతకు ప్రత్యేక సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 04:42 AM