Share News

నాకాఫ్‌ టెండర్లను రద్దు చేయాలి: జాజుల

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:40 AM

గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం పిలిచిన కేందీకృత టెండర్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని..

నాకాఫ్‌ టెండర్లను రద్దు చేయాలి: జాజుల
Jajula Srinivas Goud

హైదరాబాద్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం పిలిచిన కేందీకృత టెండర్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. ‘నాకాఫ్‌’ను గతంలో పలు ప్రభుత్వాలు బ్లాక్‌ లిస్టులో పెట్టాయని, ఇప్పుడు అదే సంస్థకు టెండరు కట్టబెట్టడం శోచనీయమన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఆయన స్పందిస్తూ.. సీఎం రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకుని నాకాఫ్‌ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సంస్థ 20 శాతం కమీషన్‌ ఒప్పందాలతో అనుభవం లేని వారికి సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చిందని, దీని వెనుక కొందరు అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ చార్జీల పునఃపరిశీలన

రైతు డిస్కంకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ

ఆర్టీసీకి దసరా కళ.. ప్రయాణికుల రద్దీ ప్రారంభం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 06:42 AM