Share News

మునిసిపల్‌ అధికారుల బదిలీలపై పునఃసమీక్షించాలి

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:38 AM

మునిసిపల్‌ శాఖలో కొంతమంది అధికారుల బదిలీలపై పునఃసమీక్షించాలని మునిసిపల్‌ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్‌.తాజ్‌ మోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విన్నవించారు.

మునిసిపల్‌ అధికారుల బదిలీలపై పునఃసమీక్షించాలి
Telangana Municipal Transfers

  • సీఎంకు ఉద్యోగుల సంఘం వినతి

గన్‌పార్క్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ శాఖలో కొంతమంది అధికారుల బదిలీలపై పునఃసమీక్షించాలని మునిసిపల్‌ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్‌.తాజ్‌ మోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విన్నవించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ హయాంలో శేర్‌లింగంపల్లి, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా మమత పని చేశారని తెలిపారు. అప్పుడు తెలంగాణ మునిసిపల్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మమతను ఆదిలాబాద్‌ జిల్లాకు బదిలీ చేశారని తెలిపారు.


తాజాగా డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌లో విధుల్లో చేరినట్లు సమాచారం ఉందన్నారు. కేటీఆర్‌ ఓఎ్‌సడీగా పని చేసిన మహేందర్‌ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఇటీవల ఆయన ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌కు సంబంధించిన కీలక పదవి చేపట్టారని పేర్కొన్నారు. ఇలా గత ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన వారు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ చలామణి కావడం సరికాదన్నారు. తెలంగాణ మునిసిపల్‌ అధికారులు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడి, సరైన న్యాయం చేయాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో స్వాతంత్య్ర పోరాటం

రోగుల భద్రతకు భరోసా!

కోతకు ముందే కొనుగోలు!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 06:38 AM