యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్లకు ఫ్రీ ఎగ్జిట్
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:22 AM
ప్రస్తుత విద్యా (2026-27) సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఫ్రీ-ఎగ్జిట్ అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
నేటి సాయంత్రం 5 గంటల వరకే గడువు
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా (2026-27) సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఫ్రీ-ఎగ్జిట్ అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. యూనివర్సిటీ అనుబంధ వైద్య కళాశాలలతోపాటు అనురాగ్ వర్సిటీ పరిధిలోని నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్సలో రెండో విడత కౌన్సెలింగ్ వరకూ సీట్లు పొందిన అభ్యర్థులు బుధవారం సాయంత్రం 5 గంటలకు వరకూ ఎటువంటి పెనాల్టీ లేకుండా సీటు వదులుకోవచ్చునని కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
అందుకోసం విద్యార్థులు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఫ్రీ ఎగ్జిట్ కింద సీటు రద్దు చేసుకుంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఫ్రీ ఎగ్జిట్ కింద సీటు రద్దు చేసుకున్న విద్యార్థులు.. ఈ విద్యా సంవత్సరం మేనేజ్మెంట్ కోటా తదుపరి విడత కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అనర్హులని వర్సిటీ స్పష్టం చేసింది. అయితే, ఫ్రీ-ఎగ్జిట్ గడువు ముగిశాక జరిగే మాప్-అప్ రౌండ్లో యాజమాన్య కోటా నుంచి కన్వీనర్ కోటాకు అప్గ్రేడ్ అయ్యే విద్యార్థులకు పెనాల్టీ వర్తించదని వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఏసీబీ కస్టడీకి నిమ్స్ లక్ష్మీ భాస్కర్
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.2.71 కోట్ల గంజాయి స్వాధీనం
అవును.. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చాం
Read Latest AP News And Telangana News And International