ఎంబీబీఎస్ మేనేజ్‌మెంట్ కోటా భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:03 AM
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నెల 24 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, అనురాగ్ యూనివర్సిటీ అనుబంధ నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌సలోని సీట్లు కూడా ఇందులో ఉన్నాయి. తుది మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్న అర్హులైన అభ్యర్థులు కళాశాలల ప్రాధాన్యం ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వర్సిటీ వెల్లడించింది.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspvtmedadm.tsche.in ద్వారా ఈనెల 22 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మేనేజ్‌మెంట్ కోటాలోని బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక (తెలంగాణ) విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లను దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు ఓపెన్ కోటా కింద కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా వర్సిటీ ఫీజు చెల్లించి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్ షాప్‌ల బంద్
యంత్రాల నిర్వహణకే యూజర్ చార్జీలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News