Share News

యంత్రాల నిర్వహణకే యూజర్‌ చార్జీలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:56 AM

ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వినియోగిస్తున్న విలువైన యంత్రాల నిర్వహణకు డబ్బుల్లేకపోవడంతో ప్రజల నుంచి యూజర్‌ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నామని రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ ...

యంత్రాల నిర్వహణకే యూజర్‌ చార్జీలు
Rajendranagar Veterinary Hospital

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై రాజేంద్రనగర్‌ వెటర్నరీ ఆసుపత్రి వివరణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వినియోగిస్తున్న విలువైన యంత్రాల నిర్వహణకు డబ్బుల్లేకపోవడంతో ప్రజల నుంచి యూజర్‌ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నామని రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ యునివర్సిటీకి అనుబంధంగా ఉన్న వెటర్నరీ క్లినికల్‌ కాంప్లెక్స్‌(వీసీసీ) ఆసుపత్రి తెలిపింది. చిన్నపాటి శస్త్రచికిత్సలకు రూ. 500, పెద్ద సర్జరీలకు రూ. 2 వేల చొప్పున వసూలు చేస్తున్నామని వెటర్నరీ సైన్స్‌ కాలేజ్‌ అసోసియేట్‌ డీన్‌ తెలిపారు.


నగరంలోని ఇతర ప్రైవేటు పశువుల ఆసుపత్రులతో పోలిస్తే తమ చార్జీలు తక్కువేనన్నారు. ఈ నెల 21న ‘ఆంధ్రజ్యోతి’లో ‘అక్కడ విద్యార్థులే వైద్యులు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. వీసీసీలోని అన్ని విభాగాల్లో సీనియర్‌ వైద్యులు అందుబాటులో ఉన్నారని, అత్యవసర కేసులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్‌ షాప్‌ల బంద్‌
భక్తే శ్వాసగా ఈశ్వరమ్మ.. గుట్టపైనే తుదిశ్వాస!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 07:56 AM