ఆ ముగ్గురు సీనియర్ మావోయిస్టులు లొంగిపోవాలి: డీజీపీ పిలుపు
ABN , Publish Date - Nov 23 , 2026 | 02:04 PM
ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని.. అజ్ఞాతంలో ఉన్న ముగ్గురు సీనియర్ మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో గతంలో లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు రూ.5 కోట్ల 59 లక్షల 50 వేల నగదు రివార్డును తెలంగాణ డీజీపీ సి.వి. ఆనందర్ పంపిణీ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 23: ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని.. అజ్ఞాతంలో ఉన్న ముగ్గురు సీనియర్ మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో గతంలో లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు రూ.5 కోట్ల 59 లక్షల 50 వేల నగదు రివార్డును తెలంగాణ డీజీపీ సి.వి. ఆనందర్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 824 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని వివరించారు. వారిలో 59 మంది తెలంగాణ, 754 మంది ఛత్తీస్‌గఢ్, 9 మంది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు 659 మంది మావోయిస్టులకు రూ.17 కోట్ల 68 లక్షల 35 వేల నగదు ప్రోత్సాహకం అందజేసినట్లు చెప్పారు. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు అందగానే మిగిలిన 96 మందికి కూడా రివార్డు నగదు జమ చేస్తామని అన్నారు.
తెలంగాణకు చెందిన 57 మంది మావోయిస్టులకు నిమ్స్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం కోసం ఆరోగ్య రక్షణ కార్డుల పంపిణీ చేశామని వివరించారు. తెలంగాణకు చెందిన 10 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగిలిన 49 మందికి స్థలాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. 2026లో ఇప్పటి వరకు 266 మంది మావోయిస్టుల లొంగిపోయారని వివరించారు. వీరిలో ముగ్గురు సీసీఎం, 13 మంది ఎస్సీఎం (స్టేట్ కమిటీ మెంబర్స్) సభ్యులు ఉన్నారని తెలిపారు. 2026లో కర్రెగుట్టల ప్రాంతంలోని 9 డంప్‌ల నుంచి 48 ఏకే-47లతోసహా 252 తుపాకులు, 359 బీజీఎల్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణకు చెందిన ముగ్గురు సీనియర్ మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా ముగ్గురు సీనియర్ మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. వారి కూడా ప్రభుత్వం ఎదుట లొంగిపోతే దేశంలో పూర్తిగా మావోయిస్టుల శకం ముగిసిట్లే అవుతుంది. 2026, మార్చి 31వ తేదీలోపు మావోయిస్టులు లొంగిపోవాలంటూ కేంద్రం ఆపరేషన్ కగార్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే
ఈ వార్తలు కూడా చదవండి..
పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు ఆపాలి.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ వినతి
ఏపీకి వస్తున్న పెట్టుబడులు చూసి అసూయపడే పరిస్థితిలో పక్క రాష్ట్రాలు: ఎమ్మెల్యే సోమిరెడ్డి