Share News

భూముల రీ సర్వేలో నిర్లక్ష్యానికి తావులేదు

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:11 AM

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమంలో నిర్లక్ష్యానికి తావులేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

భూముల రీ సర్వేలో నిర్లక్ష్యానికి తావులేదు
Ponguleti Srinivas Reddy

  • మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమంలో నిర్లక్ష్యానికి తావులేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం, క్షేత్రస్థాయిలో స్వాధీనం, రెవెన్యూ రికార్డుల మధ్య వ్యత్యాసాలను శాస్ర్తీయంగా గుర్తించి వివాదాలకు అవకాశం లేని భూరికార్డులను రూపొందిస్తామన్నారు.


సీసీఎల్‌ఏ మార్గదర్శకాలను(ఎస్ఓపీ) తప్పనిసరిగా అమలు చేయాలని, రీసర్వేకు ముందే రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులకు తమ వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలన్నారు. దశాబాల నాటి భూసమస్యలకు పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిబంధనల అమలులో రాజీ పడకుండా, సర్వే వల్ల ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 04:13 AM