కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోవాలి
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:05 AM
కృష్ణా నది నుంచి ఏపీ అనుమతులు లేకుండా నీటిని తరలించడాన్ని అడ్డుకోవాలని విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది.
తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్
ఖైరతాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నది నుంచి ఏపీ అనుమతులు లేకుండా నీటిని తరలించడాన్ని అడ్డుకోవాలని విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు సంఘం అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశం మాట్లాడారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్టు అనుమతి లేకుండా నీటిని తరలించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులపై అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి న్యాయం చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్
Read Latest Telangana News And Telugu News