జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్: హరీశ్ రావు
ABN , Publish Date - Aug 24 , 2026 | 02:56 PM
తెలంగాణలో 121 కొత్త మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్ జారీ చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం జారీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 121 రకాల మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా.. మద్యం బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్’ అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టకుండా మద్యం వ్యాపారంపై ఎందుకు అంత ఆసక్తి చూపుతోందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం లిక్కర్ అమ్మకాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.
121 కొత్త మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్
తెలంగాణలో కొత్తగా 121 రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నట్లు ఆదివారం ప్రకటన వెలువడింది. సుమారు 18 కంపెనీలకు చెందిన మద్యం సరఫరాదారులు ఈ బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
Also Read:
పెద్దపల్లిలో ఉగ్ర లింకుల కలకలం.. ఎన్‌ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ