ప్రాజెక్టుల ఆచరణ సాధ్యతను కోర్టులు నిర్ణయించలేవు: హైకోర్టు
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:28 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే నిర్దిష్ట మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆచరణ సాధ్యమైనవా కాదా? ఆ ప్రాజెక్టు విస్తృత ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉందా లేదా? అనే అంశాన్ని న్యాయస్థానాలు నిర్ణయించలేవని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే నిర్దిష్ట మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆచరణ సాధ్యమైనవా కాదా? ఆ ప్రాజెక్టు విస్తృత ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉందా లేదా? అనే అంశాన్ని న్యాయస్థానాలు నిర్ణయించలేవని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఈ అంశంలో న్యాయసమీక్ష అధికారం పరిమితంగానే ఉంటుందని పేర్కొంది. దురుద్దేశం, చట్టంలోని నిబంధల ఉల్లంఘన వంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప సాధారణంగా ప్రాజెక్టు అలైన్‌మెంట్ అంశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.
జాతీయ రహదారి (ఎన్‌హెచ్) 167కే ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న కల్వకుర్తి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొత్రశివార్ గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 509లో ఉన్న తన ఎకరం భూమిని అవసరం లేకున్నా భూసేకరణ ద్వారా తీసుకుంటున్నారని పేర్కొంటూ శ్రవణ్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సింగిల్ జడ్జి డిస్మిస్ చేయడంతో డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌కోషీ, జస్టిస్ చలపతిరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాజెక్టు అలైన్‌మెంట్ వంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ అప్పీల్‌ను కొట్టేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News