ఎపిక్ నంబర్ లేదని గ్రాడ్యుయేట్ ఓటరు దరఖాస్తు తిరస్కరించొద్దు: సీఈవో
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:30 AM
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం సమర్పించిన ఫారం-18 దరఖాస్తుల్లో ఎపిక్ (ఎలక్టోరల్ ఓటరు కార్డు) నంబర్ వివరాలు ఇవ్వలేదనే కారణంతో..
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం సమర్పించిన ఫారం-18 దరఖాస్తుల్లో ఎపిక్ (ఎలక్టోరల్ ఓటరు కార్డు) నంబర్ వివరాలు ఇవ్వలేదనే కారణంతో.. ఆ దరఖాస్తులను తిరస్కరించకూడదని సీఈవో సి.సుదర్శన్రెడ్డి ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఎపిక్ కార్డు నంబరు లేదని ఫారం-18 దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ.. మంగళవారం మార్గదర్శకాలు సూచిస్తూ మెమో జారీ చేశారు. ఓటర్ల నమోదు కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈనెల 15, 16 తేదీల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నట్లు సీఈవో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవీఎస్ రాజు కన్నుమూత
సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా
సంస్కృత విద్యాపీఠానికి శాశ్వత భవనం!
Read Latest AP News And Telangana News And International