Share News

ఎమ్మెల్సీ ఎన్నికలకు యూత్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జీలు

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:47 AM

మార్చిలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమించినట్లు యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు యూత్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జీలు
Telangana MLC Elections

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మార్చిలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమించినట్లు యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 2 వార్‌ రూమ్‌లనూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయా జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువజన కాంగ్రెస్‌ శ్రేణులను వారు సమన్వయం చేస్తారని, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల సూచనల మేరకు బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్‌

కీసర మాజీ సీఐ కోటీశ్వరుడే!

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 19 , 2026 | 06:47 AM