లోక్‌భవన్‌లో ఆయుధ పూజలు నిర్వహించిన గవర్నర్
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:54 AM
విజయదశమి సందర్భంగా లోక్‌భవన్ ప్రాంగణంలోని పోచమ్మతల్లి గుడి వద్ద గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆయుధ పూజ నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): విజయదశమి సందర్భంగా లోక్‌భవన్ ప్రాంగణంలోని పోచమ్మతల్లి గుడి వద్ద గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆయుధ పూజ నిర్వహించారు. గ్యారేజ్‌లోని అధికారిక వాహనాలకు కూడా పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలనేవి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను తీసుకుని రావాలని ఆకాంక్షించారు.
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణ్, ఏడీసీ కాంతిలాల్, సీఎ్‌సఓ మట్టయ్య, ప్రెస్ సెక్రటరీ దశరథం, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రమోహన్ తదితరులు ఈ పూజల్లో పాల్గొన్నారు. మరోవైపు నాదర్‌గుల్‌లోని ఎంవీఎ్‌సఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాద ఘటనపై గవర్నర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగానికి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్‌కో నుంచే...
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International