Minister Jupally On Sankranti: తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేలా సంక్రాంతి కార్యక్రమాలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:00 PM
సంక్రాంతి పండుగను రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జనవరి 13 నుంచి 17 వరకు పరేడ్ గ్రౌండ్‌లో ‘కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్’ కార్యక్రమం ఉంటుందన్నారు.
హైదరాబాద్: ఈ సంక్రాంతి పండుగను సంప్రదాయం, సంస్కృతి పరిరక్షణకు అనుగుణంగా ఘనంగా జరుపుతున్నామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 13 నుంచి 17 వరకు ‘కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్’ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫెస్టివల్‌లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, అదేవిధంగా మన దేశంలోని 15 రాష్ట్రాల కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ ఉత్సవంలో వివిధ రాష్ట్రాలకు చెందిన స్వీట్ స్టాల్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ షో కోసం ఏవియేషన్ అనుమతి ఇప్పటికే తీసుకున్నామన్నారు. ఈ బెలూన్ షో బుకింగ్ కోసం ఆన్‌లైన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో పగలు గోల్ఫ్ కోర్స్, పరేడ్ గ్రౌండ్‌లో నైట్ డ్రోన్ షోలు కూడా ఉంటాయన్నారు. చెరువుల పరిరక్షణ లక్ష్యంగా నగరంలోని అన్ని చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
Also Read:
సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర
కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..
For More Latest News