Share News

తెలంగాణను తొలి నషా ముక్త్‌ రాష్ట్రంగా మార్చాలి

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:35 AM

తెలంగాణను దేశంలోనే తొలి మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా పిలుపునిచ్చారు.

తెలంగాణను తొలి నషా ముక్త్‌ రాష్ట్రంగా మార్చాలి

  • మోదీ సంకల్పాన్ని ఉద్యమంగా చేపట్టాలి: గవర్నర్‌ శివ ప్రతాప్‌

  • 2029 నాటికి డ్రగ్స్‌ రహిత భారతమే లక్ష్యం: లక్ష్మణ్‌

ఖైరతాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను దేశంలోనే తొలి మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో అక్షర స్ఫూర్తి ఫౌండేషన్‌ ద్వారా ఆదివారం నిర్వహించిన నషా ముక్త్‌ భారత్‌ మెగా సైకిల్‌ ర్యాలీని గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చాలన్న ప్రధాని మోదీ సంకల్పాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరారు. ఈ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. కె. లక్ష్మణ్‌ గత నాలుగు నెలలుగా ప్రతి ఆదివారం సైకిల్‌ యాత్రల ద్వారా నషా ముక్త్‌ భారత్‌ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుండటం అభినందనీయమని గవర్నర్‌ ప్రశంసించారు.


డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. 2029 నాటికి డ్రగ్స్‌ రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి, యువకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. నెక్లెస్‌ రోడ్‌, సీతారాంపేట, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌, హైటెక్‌ సిటీ నుంచి అసెంబ్లీ ప్రాంగణం వరకు సాగిన ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, ఈగల్‌ ఫోర్స్‌ ఇన్‌చార్జి సందీప్‌ శాండిల్య, బీజేపీ నేతలు దీపక్‌ రెడ్డి, డాక్టర్‌ విక్రాంత్‌ సింగ్‌, అక్షర స్ఫూర్తి ఫౌండేషన్‌ కన్వీనర్‌ రాహుల్‌, భరత్‌ ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్

Updated Date - Nov 30 , 2026 | 04:37 AM