ఫ్యాన్సీ నంబర్లకు గడువు కుదింపు
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:22 AM
వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లు పొందాలనుకునే వారికి రవాణా శాఖ గడువు కుదించింది.
60 నుంచి 30 రోజులకు తగ్గింపు ..నేటి నుంచి అమలు
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లు పొందాలనుకునే వారికి రవాణా శాఖ గడువు కుదించింది. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబర్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న 60 రోజుల గడువును 30 రోజులకు తగ్గించింది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన యజమానులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) జారీ అయిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఫ్యాన్సీ నంబర్ కోసం రిజర్వేషన్, బిడ్డింగ్, చెల్లింపు ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో సంబంధిత వాహనానికి ర్యాండమ్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయించనున్నారు. ఫ్యాన్సీ నంబర్ కోసం ఆసక్తి ఉన్నవారు గడువును దృష్టిలో ఉంచుకుని ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News