దేవాదాయ శాఖలో పూర్తిస్థాయి డిజిటలీకరణే లక్ష్యం: కొండా సురేఖ
ABN , Publish Date - Jul 20 , 2026 | 08:24 PM
దేవాదాయ శాఖ పరిధిలోని పరిపాలనను పూర్తిస్థాయిలో డిజిటలీకరణే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ధార్మిక సంస్థలు, దేవాలయాల చట్టం - 2025 డ్రాఫ్ట్‌పై ఆమె సమీక్షించారు.
హైదరాబాద్, జులై 20: దేవాదాయ శాఖ పరిధిలోని పరిపాలనను పూర్తిస్థాయిలో డిజిటలీకరణే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ధార్మిక సంస్థలు, దేవాలయాల చట్టం - 2025 డ్రాఫ్ట్‌పై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. దేవాదాయ శాఖలో డిజిటల్ సంస్కరణలకు దిశానిర్దేశం చేశారు. TAIMS వ్యవస్థకు మరిన్ని మెరుగులు దిద్దాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భక్తులకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. TAIMSపై అధికారుల ప్రజెంటేషన్‌కు మంత్రి కీలక సూచనలు చేశారు.
క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు డ్రాఫ్ట్ రూల్స్‌పై సుదీర్ఘంగా సమీక్షించారు. ట్రస్ట్ బోర్డు పనితీరు పారదర్శకంగా ఉండేలా నియమావళి రూపొందించాలని సూచించారు. దేవస్థానాల పరిపాలనను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వివరించారు. యాదగిరిగుట్ట - వేములవాడ దేవాలయాల్లోని సిబ్బంది పరస్పర బదిలీలపై మంత్రి సురేఖకు ఈ సందర్భంగా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంతోపాటు వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వచ్చాంధ్ర కోసం వాణిజ్య, స్వచ్ఛంధ సంస్థలను భాగస్వామ్యం చేయాలి: పట్టాభిరామ్
బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో.. తమ్మినేని స్కాం వెలుగులోకి: ఎంపీ కలిశెట్టి
Read Latest TG News And Telugu News