స్వచ్చాంధ్ర కోసం వాణిజ్య, స్వచ్ఛంధ సంస్థలను భాగస్వామ్యం చేయాలి: పట్టాభిరామ్
ABN , Publish Date - Jul 20 , 2026 | 07:24 PM
స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని ఆ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్ల భాగస్వామ్యం పెంచాలని అన్నారు.
అమరావతి, జులై 20: స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని ఆ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్ల భాగస్వామ్యం పెంచాలని అన్నారు. స్వచ్ఛ రక్షణ కార్యక్రమాల్లో వాణిజ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీలు వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ సమర్పించాలని సూచించారు.
ఆగస్టు చివరి నాటికి అవగాహన, శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులకు ఆయన తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రపై ప్రజా అవగాహన కల్పించాలని అన్నారు. ఉపాధ్యాయులకు నిర్వహించే ఐఈసీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని చెప్పారు. 53 పట్టణ స్థానిక సంస్థల్లో 923 IEC కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 3.38 లక్షల మందికి స్వచ్ఛత, వ్యర్థాల నిర్వహణపై వాష్ సంస్థ అవగాహన కల్పించిందని పేర్కొన్నారు. 432 సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 29,339 మందికి శిక్షణ ఇచ్చినట్లు గణాంకాలతో సహా వివరించారు.
ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపల్ కార్యాలయాల సంఖ్య 20కి చేరిందని అన్నారు. మార్కెట్లు, రైల్వేస్టేషన్లలో స్వచ్ఛ రక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 70 యూఎల్‌బీల్లో 28,229 మందికి శిక్షణ అందించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో.. తమ్మినేని స్కాం వెలుగులోకి: ఎంపీ కలిశెట్టి
For More AP News And Telugu News