Share News

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Jul 20 , 2026 | 07:00 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆషాడం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం, రథోత్సవం.. రేపు, ఎల్లుండ (మంగళవారం, బుధవారం) నిర్వహించనున్నారు.

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..  ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Balkampet Yellamma Temple In Hyderabad

హైదరాబాద్, జులై 20: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆషాడం బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం, రథోత్సవం.. రేపు, ఎల్లుండ (మంగళవారం, బుధవారం) నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో బల్కంపేట పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసి పోనుంది. దాంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను మరో మార్గంలో మళ్లిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ వెల్లడించారు.


గ్రీన్‌ల్యాండ్స్, సత్యం థియేటర్ నుంచి బల్కంపేట, ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎస్ఆర్ నగర్ 'T' జంక్షన్, బీకే గూడ మీదుగా సనత్‌నగర్ వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కట్టమైసమ్మ గుడి, బేగంపేట వైపు మళ్లిస్తామని పేర్కొన్నారు. గ్రీన్‌ల్యాండ్స్ - ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట వైపు వాహనాలకు నో ఎంట్రీ అని చెప్పారు. బేగంపేట, కట్టమైసమ్మ ఆలయం నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను సత్యం థియేటర్, మైత్రీవనం వైపు మళ్లిస్తామని అన్నారు.


ఎస్ఆర్ నగర్ 'T' జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న చిన్న సందులు (By-lanes) అన్నీ మూసివేస్తామని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ఆర్ అండ్ బీ కార్యాలయం, GHMC గ్రౌండ్, నేచర్ క్యూర్ హాస్పిటల్ వద్ద సౌకర్యం కల్పించామని వివరించారు. ఈ ప్రాంతం వైపు వచ్చే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో.. తమ్మినేని స్కాం వెలుగులోకి: ఎంపీ కలిశెట్టి

సాయికృష్ణ కేసులో విజయలక్ష్మిని ప్రశ్నించిన సిట్ అధికారులు

Read Latest TG News And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 07:05 PM