Share News

సాయికృష్ణ కేసులో విజయలక్ష్మిని ప్రశ్నించిన సిట్ అధికారులు

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:58 PM

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ మరింత ముమ్మరం చేసింది. అందులో భాగంగా సోమవారం విజయవాడలోని సాయికృష్ణ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు.

సాయికృష్ణ కేసులో విజయలక్ష్మిని ప్రశ్నించిన సిట్ అధికారులు
Sai krishna Mother Vijayalakshmi

విజయవాడ, జులై 20: గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ మరింత ముమ్మరం చేసింది. అందులో భాగంగా సోమవారం విజయవాడలోని సాయికృష్ణ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. అతడి తల్లి విజయలక్ష్మి స్టేట్‌మెంట్‌ను వారు రికార్డ్ చేశారు. ఈ లాకప్ డెత్ వెనుక ఉన్న కారణాలు ఏమిటనే అంశంపై ఆమెను వారు ఆరా తీశారు. హైకోర్టులో సాయికృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ వివరాలు కూడా సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.


అలాగే సీఐ నాగరాజు, కృష్ణ లంక పోలీసులపై విజయలక్ష్మీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను ఆమెను అడిగిన తెలుసుకున్నారు. ఈ కేసులో కృష్ణలంక పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల ప్రమేయానికి సంబంధించిన అంశాలను విజయలక్ష్మి నుంచి సిట్ అధికారులు సేకరించారు. ఇక ఈ కేసులో తనకు తెలిసిన అన్ని వివరాలను ఈ సందర్భంగా సిట్ అధికారులకు విజయలక్ష్మి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో యువతకు టూరిజం గైడ్స్‌గా ఉపాధి అవకాశాలు: మంత్రి కందుల దుర్గేష్

కాక్రోజ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అరెస్ట్.. ఖండించిన పోలీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 06:01 PM