కాక్రోజ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అరెస్ట్.. ఖండించిన పోలీసులు
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:22 PM
కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అసత్య ప్రచారాలను నమ్మ వద్దని ప్రజలకు వారు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, జులై 20: కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అసత్య ప్రచారాలను నమ్మ వద్దని ప్రజలకు వారు స్పష్టం చేశారు. అభిజిత్ దీప్కే .. జంతర్ మంతర్ ధర్నా పాయింట్ వద్ద ఉన్నారని ఢిల్లీ పోలీసులు వివరించారు. అభిజిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కానీ.. అరెస్ట్ చేయడం కానీ జరగలేదని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది.
నీట్ పేపర్ లీక్, విద్యావ్యవస్థలోని లోపాల నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) చలో పార్లమెంట్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ యాత్రకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ యాత్రలో భారీగా యువత పాల్గొంది. ఈ యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. అయినా నిరసనకారులు భారీ సంఖ్యలో పార్లమెంట్ వైపునకు దూసుకెళ్లారు. వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. దీంతో నిరసనకార్లు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గీతాంజలిపై దాడి..
ఇంకోవైపు ఈ యాత్రలో పాల్గొన్న సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి జుట్టు పట్టుకుని ఢిల్లీ పోలీసులు లాగారు. దీంతో గీతాంజలిపై పోలీసులు దాడి చేశారంటూ సీజేపీ ఆరోపించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న 12 ఏళ్ల బాలికపై పోలీసులు దాడి చేశారని.. దీంతో ఆమె తల పగిలిందని వివరించింది. మరో 40 నుంచి 50 మంది సీజేపీ కార్యకర్తల తలలు పగిలిపోయాయని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది.
నేటి నుంచి వర్షా కాల సమావేశాలు..
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో పార్లమెంట్, జంతర్ మంతర్‌తోపాటు ఢిల్లీలోని వివిధ ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. జూన్ 28వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం బలవంతంగా సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన చలో పార్లమెంట్ యాత్రకు ఆయన మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
APAAR ఐడీ పూర్తి స్వచ్ఛందం.. నిరాకరిస్తే అడ్మిషన్లు ఆపొద్దు: సుప్రీంకోర్టు
త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి..
For More National News And Telugu News