త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి..
ABN , Publish Date - Jul 20 , 2026 | 02:07 PM
త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌ఖడ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విగతజీవిగా పడి ఉన్న ఆయనను సోమవారం పోలీసులు గుర్తించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌ఖడ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విగతజీవిగా పడి ఉన్న ఆయనను సోమవారం పోలీసులు గుర్తించారు. అనురాగ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆఫీస్ ఛాంబర్‌లో విగతజీవిగా పడి ఉన్న అనురాగ్‌ను పోలీసులు గుర్తించారు.
ఆయనను గోవింద్ భల్లబ్ పంత్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అనురాగ్ మరణానికి గల సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అనురాగ్ ధన్‌ఖడ్ 1994 బ్యాచ్‌కు చెందిన త్రిపుర క్యాడెర్ ఐపీఎస్. 2025 మే నెలలో త్రిపుర డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు త్రిపురలో డైరెక్టర్ జనరల్(ఇంటెలిజెన్స్)గా పని చేశారు. ఆయన సీబీఐలో కూడా విశేషమైన సేవలు అందించారు.
ఇవి కూడా చదవండి
పప్పులు Vs గుడ్లు.. ప్రొటీన్ ఎక్కువగా దేనిలో ఉంటుంది?
'టికీ-టాకా'కు కొత్త హంగులు.. స్పెయిన్ విజయ సూత్రమదే.!