Share News

ఏపీలో యువతకు టూరిజం గైడ్స్‌గా ఉపాధి అవకాశాలు: మంత్రి కందుల దుర్గేష్

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:29 PM

ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు టూరిజం గైడ్స్‌‌గా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కొనసాగుతుంది.

ఏపీలో యువతకు టూరిజం గైడ్స్‌గా ఉపాధి అవకాశాలు: మంత్రి కందుల దుర్గేష్
AP Minister Kandula durgesh

జైపూర్, జులై 20: ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు టూరిజం గైడ్స్‌‌గా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కొనసాగుతుంది. సోమవారం టూరిజం గైడ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌ నరేంద్ర సింగ్‌ రాథోడ్‌తో మంత్రి దుర్గేష్ సమావేశమయ్యారు. టూరిజం గైడ్స్ ఫెడరేషన్ సహకారంతో ఏపీ యువతకు టూర్ గైడ్స్‌గా ట్రైనింగ్ ఇవ్వాలని ఈ సందర్బంగా రాథోడ్‌ను ఆయన కోరారు.


ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలంటూ రాథోడ్‌ను కందుల దుర్గేష్ ఆహ్వానించారు. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించేందుకు త్వరలో టూరిజం గైడ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో ఏఐ డిజిటల్ గైడ్స్‌తో పాటు ప్రొఫెషనల్ టూర్ గైడ్స్ అందుబాటులోకి వస్తారని మంత్రి దుర్గేష్ వివరించారు.


సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో పర్యాటక రంగంలోని 20 కీలక విభాగాలలో 10 వేల మంది యువతకు శిక్షణ అందించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి.. కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

‘హెల్తీ- వెల్తీ- హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా ముందుకు: మంత్రి అనగాని సత్యప్రసాద్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 04:44 PM